వైసీపీ (ysrcp) సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy) కోవిడ్ బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే వీటిలో ఆసుపత్రికి వెళ్లేంత తీవ్రత లేకపోవడం ఊరట కలిగించే విషయం. మరోవైపు సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ఇటీవలి కాలంలో కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ , క్రీడా ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలకు పాజిటివ్‌గా తేలింది. వీరిలో కొందరు కోలుకోగా.. మరికొందరు క్వారంటైన్‌లో వున్నారు. తాజాగా వైసీపీ (ysrcp) సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy) కోవిడ్ బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలికాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,310 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,70,491కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,606కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 9,692 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,39,854కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 39,296 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,45,428కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,16,031 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 99, చిత్తూరు 411, తూర్పుగోదావరి 910, గుంటూరు 1249, కడప 1697, కృష్ణ 1008, కర్నూలు 1379, నెల్లూరు 927, ప్రకాశం 700, శ్రీకాకుళం 229, విశాఖపట్నం 853, విజయనగరం 222, పశ్చిమ గోదావరిలలో 626 చొప్పున వైరస్ బారినపడ్డారు.