ఎస్ఈసీలో వ్యవహారంలో హైకోర్టు తీర్పును పరిగణనలోనికి తీసుకోవాల్సిందిగా గవర్నర్ చెప్పారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

గవర్నర్ లెటర్‌ను తాము ఖచ్చితంగా గౌరవిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీఈసీ పదవిలో శాశ్వతంగా ఉండాలని టీడీపీ భావిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read:నిమ్మగడ్డ ఇష్యూ: చంద్రబాబు హ్యాపీ, ఆత్మరక్షణలో వైఎస్ జగన్

సీఈసీ వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోందని.. నిమ్మగడ్డకు కోర్టు ఖర్చుల కోసం డబ్బులు ఎవరిస్తున్నారని ఆయన నిలదీశారు. నిమిషానికి లక్షలు లక్షలు తీసుకునే లాయర్‌లను పెట్టుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఆ డబ్బులు చంద్రబాబు ఇస్తున్నారా.. లేదా.. అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు అలవాటు పడ్డారని.. నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తే అంతటి కాస్ట్‌లీ లాయర్లను పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని.. అందులో ఉన్న చంద్రబాబు వ్యక్తులు కాదని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read:పంతానికి పోతే: నిమ్మగడ్డ ఇష్యూలో జగన్ కు వరుస ఎదురు దెబ్బలు ఇవీ...

సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గౌరవించాల్సిన పనిలేదా..? అని  ఆయన నిలదీశారు. పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 30 మందిని చంపిన చరిత్ర చంద్రబాబుదని.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లాకు ధర్మరాజు లాంటి వారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

అదే జిల్లాలో చంద్రబాబును రాక్షసుడిగా చూస్తారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు స్పందించారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటున్నామని.. అది మీకు కనబడట్లేదా అని ఆయన ఎద్దేవా చేశారు.