Yatra 2 Movie: ‘యాత్ర 2’ నేడే విడుదల.. వైసీపీ ఎమ్మెల్యేలకు స్పెషల్ షో.. వారి రియాక్షన్ ఏంటీ? 

Yatra 2 Movie: దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2. ఈ సినిమా రిలీజ్‌కి ముందు రోజు.. విజయవాడలోని బెంజ్ సర్కిల్ క్యాపిటల్ సినిమాస్‌లో ‘యాత్ర 2’ స్పెషల్ షో‌ని ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు హజరయ్యారు. 

YSRCP MLA's Reaction On Yatra 2 Movie KRJ

Yatra 2 Movie: దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు  మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు. ఈ చిత్రం ఆనాడు ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. కాగా..ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన  "యాత్ర 2" ఫిబ్రవరి 8న (నేడు) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా..  ఈ సినిమా రిలీజ్‌కి ముందు రోజు.. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక షో వేసి చూపించారు. బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత విజయవాడలోని బెంజ్ సర్కిల్ క్యాపిటల్ సినిమాస్‌లో ‘యాత్ర 2’ స్పెషల్ షో‌ని ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు హజరయ్యారు. 

ఈ సినిమా ప్రదర్శన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "యాత్ర ,యాత్ర2 మన కళ్ల ముందు జరిగిన చరిత్రలే.., వైఎస్ ఐదేళ్ల పాలన లో కోట్లాదిమందికి దగ్గర కావడడం నాయకుడిగా ఎలా ఎదగాలని చూపించారు. యాత్ర 2 చూసి అనేకమంది భావోద్వేగానికి గురయ్యారు. మనసున్న మనుషులు మనకళ్ల ముందే దేవుళ్లుగా మారడంతో ఆదర్శప్రాయులు అవుతారు. రాజకీయం అంటే ఎత్తులు పైఎత్తులు కాదు ప్రజల మనసులు గెలుచుకోవాలి." అని పేర్కొన్నారు.  

అలాగే.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.." సినిమా చూస్తుంటే కంట కన్నీరు వచ్చింది. జగన్ పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. జగన్ ఇచ్చిన మాట గురించి కళ్లకు కట్టినట్డు చూపించారు. సినిమాలో పాత్రలు చూస్తే భావోద్వేగాలు వచ్చేలా.. తెలిసిన కధ , మళ్లీ తెలుసుకోవాల్సిన కధ యాత్ర2" అని పేర్కొన్నారు. 

వైసీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ మాట్లాడుతూ.. "యాత్ర’లో వైఎస్ పాదయాత్రను కీలక అంశంగా చూపించారు. యాత్ర 2లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను కళ్లకి కట్టినట్టు చూపించారని అన్నారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకుని వచ్చారు. దాన్నే ‘యాత్ర’లో చూపించారు. యాత్ర 2లో జగన్ గారు కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి పాదయాత్ర చేసిన కీలక ఘట్టాలను చూపించారన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదని, ఈ చిత్రాన్ని అందరూ చూడాలి " అని కోరారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios