ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ పడింది. సభను సజావుగా సాగనివ్వడం లేదని... టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్ కన్నా కూడా సభలో ఎమ్మెల్యే రోజా ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

డిప్యూటీ స్పీకర్... ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ప్రకటించగానే.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వాళ్లని చూసి వెంటనే నవ్వేశారు. ఆమె నవ్వగానే... రోజా పక్కన ఉన్న మరికొందరు మహిళా ఎమ్మెల్యేలు కూడా నవ్వేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేల వైపు చేతిని చూపిస్తే... పక్కన ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో ఆమె సంభాషణ జరిపారు. దీంతో... కెమేరా ఆమెపై ఫోకస్ చేశాయి.ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే... గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రోజాపై దాదాపు సంవత్సరం సస్పెన్షన్ విధించారు. కాగా... ఆమె న్యాయ పోరాటం చేసి మరీ సభలో మళ్లీ అడుగుపెట్టారు.