Asianet News TeluguAsianet News Telugu

2019లో అధికారంలోకి రాకపోతే జన్మలో పోటిచెయ్యను: ఎమ్మెల్యే సవాల్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా జడ్పీ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

ysrcp mla rachamallu sivaprasadreddy challenge minister adinarayanareddy
Author
Kadapa, First Published Dec 15, 2018, 8:34 PM IST

కడప: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా జడ్పీ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యపై జరిగిన చర్చలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాచమల్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంతో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఒక వేళ చంద్రబాబు ఓడిపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అని మంత్రికి రాచమల్లు సవాల్‌ విసిరారు. 

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ పై మంత్రి ఆదినారాయణ రెడ్డి దాటవేత ధోరణి ప్రదర్శించారు. 2019లో కాదు 4019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి చెప్పారు. 

ఈ సందర్భంగా మంత్రి మీ ఊరికే వస్తున్నా, మీ కథ చూస్తా. వేచి ఉండండి అంటూ రాచమల్లుపై మడ్డిపడ్డారు. అయితే బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజలు తోడుగా ఉన్నంత వరకూ ఎంత మంది వచ్చినా తనను ఏమి చేయలేరని రాచమల్లు కౌంటర్ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios