ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పీఏ సాయంత్రం కుళ్లంపల్లెలోని తన ఇంటికి టూవీలర్ లో వెళుతుండగా ఐరాలకు సమీపంలోని నగరి వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలిపయని వాహనం ఢీ కొట్టింది. 

చిత్తూరు : road accidentలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సహాయకుడు గుర్రప్ప (36) మంగళవారం మృతి చెందారు. ముఖ్యమంత్రి జగన్ birthday celebrationsలో పాల్గొన్న ఆయన సాయంత్రం కుళ్లంపల్లెలోని తన ఇంటికి two wheeler వాహనంలో వెళుతుండగా ఐరాలకు సమీపంలోని నగరి వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలిపయని వాహనం ఢీ కొట్టింది. 

తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. ఈ ఘటన మీద రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిప్రసాద్ చెప్పారు.

ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. గుర్రప్ప మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిశీలించారు. గుర్రప్ప మృతికి ఎమ్మెల్యే, వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సానుభూతి తెలిపారు. 

YS Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు రోజా సర్‌ప్రైజ్ బర్త్‌ డే గిఫ్ట్.. మరోసారి తన మార్క్ చూపించిన రోజా..

ఇదిలా ఉండగా, మంగళవారం వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్యే రోజా సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిర్భావం నుంచి రోజా.. వైఎస్ జగన్ (YS Jagan) వెంట నడుస్తున్నారు. నగరి నియోజకవర్గం (nagari constituency) నుంచి రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా.. ప్రతిపక్షాలు జగన్‌పై చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ముందువరుసలో నిలుస్తారు. 

అంతేకాకుండా తనదైన దూకుడుతో విపక్షాలపై విమర్శలు చేస్తారు. అయితే ఈ పొలిటికల్ జర్నీలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రోజా (MLA Roja) పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నారు. అసెంబ్లీలో సైతం పలుమార్లు వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. బహిరంగ సభలలో, పార్టీ సమావేశాల్లో కూడా ఆమె జగన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. 

పెద్ద మనసుకి హ్యాట్సాఫ్: సీఎం జగన్ బర్త్ డే కి రోజా సూపర్ గిఫ్ట్

అయితే ఈ ఏడాది వైఎస్ జగన్ జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా తన నియోజవర్గంలోని సంబరాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ బర్త్‌డే (ys jagan birthday) సందర్భంగా వినూత్నంగా ఆలోచించిన రోజా.. చిరకాలం గుర్తుపెట్టుకనేలా ఓ మంచి పని చేయాలని ఫిక్స్ అయ్యారు. గతేడాది వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా రోజా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది జగన్ బర్త్ డే సందర్భంగా తన నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్టుగా తెలిపారు. మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే బర్త్ డే లోపు మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.