ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబునాయుడు చెప్పడం సిగ్గుచేటన్నారు.  

రౌడీషీట్‌తో పాటు 62 కేసులున్న చింతమనేనిని స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని, చింతమనేని బాధితులకు ఆవేదన చంద్రబాబుకు ఎందుకు పట్టడం లేదని నిలదీశారు. 

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కార్యకర్తలంతా ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై మండిపడ్డారు. రౌడీషీట్ తోపాటు 62 కేసులున్న చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకు స్ఫూర్తి అని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. 

చింతమనేనిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు ఆరోపించడాన్ని అబ్బయ్యచౌదరి ఖండించారు.  చింతమనేనిపై అక్రమ కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్లలేదన్నారు. చింతమనేనిపై ఉన్న కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులేనని చెప్పుకొచ్చారు. 

ఇసుక, మట్టి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబు నాయుడకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించారు కాబట్టే ఆయనను వెనకేసుకు వస్తున్నారంటూ మండిపడ్డారు. అందువల్లే చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు ఆయన బాధితుల గోడు కూడా వినాల్సిందని సూచించారు. చింతమనేని ప్రభాకర్ బాధితుల ఆవేదనను వింటే వాస్తవాలు ఏంటో చంద్రబాబుకు తెలుస్తాయన్నారు.  

ఇకపోతే సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

వైఎస్‌ జగన్‌ది దుర్మార్గ పాలన అని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. జగన్‌ టాక్సు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్‌ మాధ్యమం, ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.  

అంతేకాదు అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలు కొందరికే వర్తింపజేస్తున్నారంటూ ప్రభుత్వం పథకాలపై చంద్రబాబు ఆరోపించారు. తన దగ్గరకు వస్తే వర్షాకాలంలో సైతం ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పిస్తానని చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

Video news : పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన...