Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేతల హత్య కేసు.. నా ప్రమేయం లేదు, ఏ శిక్షకైనా సిద్ధం: కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి

టీడీపీ నేత నారా లోకేశ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్‌కు లేదని చురకలంటించారు. కర్నూలు జిల్లా గడివేములలో టీడీపీ నేతల హత్యల నేపథ్యంలో రామ్ భూపాల్ రెడ్డి స్పందించారు.

ysrcp mla katasani bhupal reddy comments on tdp leaders murder case ksp
Author
kurnool, First Published Jun 18, 2021, 5:43 PM IST

టీడీపీ నేత నారా లోకేశ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్‌కు లేదని చురకలంటించారు. కర్నూలు జిల్లా గడివేములలో టీడీపీ నేతల హత్యల నేపథ్యంలో రామ్ భూపాల్ రెడ్డి స్పందించారు. తాము వేరే పార్టీలో వున్నప్పటికీ పనులు చేసిపెట్టినట్లు ఆయన గుర్తుచేశారు.

రైతు భరోసా కింద జోన్నలు కొనుగోలు చేయాల్సిన రైతులు వున్నారని తనతో ప్రతాప్ రెడ్డి చెప్పారని.. ఈ విషయంపై తాను విజయవాడకు వెళ్లి మార్క్‌ఫెడ్ ఎండీతో మాట్లాడతానని చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సంబంధంలేని విషయాల్లో తమను చేరుస్తున్నారని.. ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము స్వస్తి చెప్పామని రామ్ భూపాల్ రెడ్డి వెల్లడించారు. హత్యలకు సంబంధించి ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Also Read:ప్యాక్షన్ రెడ్డి గీత దాటావ్... ఇక నీ సరదా తీరుస్తాం..: జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

జంట హత్యల కేసులో తమది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రామ్‌భూపాల్ రెడ్డి వెల్లడించారు. తమకు ప్రాణహానీ ఉన్నట్లుగా వడ్ల ప్రతాప్ రెడ్డి అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తాము ఆయుధాలను పోలీసులకు సరెండర్ చేశామని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ వస్తున్న ప్రజాకర్షణ చూసి.. తాము ఏ ఎన్నికల్లో గెలవలేమని తెలిసి ఉనికి కాపాడుకోవడానికి టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వడ్డు ప్రతాప్ రెడ్డి తనకంటే ముందే ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఆయనపై 1995లోనే హత్య కేసు నమోదైనట్లు రామ్‌భూపాల్ రెడ్డి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios