యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్ధిని గెలిపించకపోతే మీకు ఏమీ రావంటూ ప్రజల్ని బెదిరించారు. 

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్ధిని గెలిపించకపోతే మీకు ఏమీ రావంటూ ప్రజల్ని బెదిరించారు. మీకు సీఎం జగన్ తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చేది నేనేనని.. కన్నబాబు రాజు అన్నారు.

గెలిచినా, ఓడినా సర్పంచ్ వైసీపీ అభ్యర్ధి మాత్రమేనని.. అవతల పార్టీ గెలిచినా కూర్చోనివ్వమని కన్నబాబు తేల్చి చెప్పారు. ఇది గుర్తు పెట్టుకుని ప్రజలంతా తమకే ఓటు వేయాలని కన్నబాబు వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఎమ్మెల్యే కన్నబాబు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు మెంబర్‌ను బెదిరించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో కన్నబాబు రాజును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై కన్నబాబు రాజు విడుదలయ్యారు. 

Also Read:పంచాయతీ ఎన్నికలు.. వైసీపీకి మరో షాక్: ఎమ్మెల్యే కన్నబాబు అరెస్ట్

అంతకుముందు బెదిరింపుల ఆరోపణలపై ఎమ్మెల్యే కన్నబాబురాజు స్పందించారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన వాటిని కలిపి మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి బావుంటుందని సూచించాను అన్నారు.

కొంత మంది పోటీదారులను డిస్‌క్వాలిఫై చేయించాన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. వీటిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.