యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు మెంబర్‌ను బెదిరించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

బాధితుడి ఫిర్యాదుతో కన్నబాబు రాజును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై కన్నబాబు రాజు విడుదలయ్యారు. 

అంతకుముందు బెదిరింపుల ఆరోపణలపై ఎమ్మెల్యే కన్నబాబురాజు స్పందించారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన వాటిని కలిపి మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు.

ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి బావుంటుందని సూచించాను అన్నారు. కొంత మంది పోటీదారులను డిస్‌క్వాలిఫై చేయించాన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. వీటిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.