ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాకినాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తనను తాను జూమ్ యాప్ సీఎంగా ప్రమోట్ చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు.

టీడీపీ అధినేత లూటీ చేసిన రూ.3 లక్షల కోట్లు ఈ కరోనా విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు పంచాలని రాజా డిమాండ్ చేశారు. కరోనా సమయంలో పొరుగు రాష్ట్రంలో దాక్కున్న ఆయన తన మాజీ మంత్రులు, తాబేదార్లతో అవాకులు చవాకులు మాట్లాడించడం సరైన పద్దతి కాదని దాడిశెట్టి హితవు పలికారు.

Also Read:ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు, మొత్తం 722: మృతుల సంఖ్య 20

కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లు కొంటే.. మన రాష్ట్రం లక్ష కిట్లు కొనుగోలు చేసిందని రాజా గుర్తుచేశారు. దీనిని బట్టే కరోనా నివారణ కోసం జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తుందో ప్రజలకు అర్ధమవుతోందని దాడిశెట్టి స్పష్టం చేశారు.

కోవిడ్ 19 నివారణ చర్యల కోసం ప్రాణాలకు తెగించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నారని చెప్పారు. కానీ ఇన్నాళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుతిన్న తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా అని రాజా అన్నారు.

Also Read:జగన్ ప్రభుత్వానికి షాక్: 3 వారాల్లోగా వైసీపీ రంగులు తొలగించాలన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 75 కేసులు కరోనా కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 722కి చేరుకుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 20 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.