జగన్ ప్రభుత్వానికి షాక్: 3 వారాల్లోగా వైసీపీ రంగులు తొలగించాలన్న హైకోర్టు
వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది
వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. అయితే ఇందుకు 3 గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సమ్మతించిన ధర్మాసనం ఈ మేరకు గడువును ఇచ్చింది.
Also Read:ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై స్పందించిన జగన్.. అధికారులపై ప్రశంసలు
పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
అయితే తమకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీకి జెండాను పోలిన రంగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
Also Read:ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు, మొత్తం 722: మృతుల సంఖ్య 20
ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వెంటనే ఆ రంగుల్ని తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.