అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో అక్రమ కట్టడంలో ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు రోజా. 

డ్రోన్ కెమెరాలంటే ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో డ్రోన్ లు ఉపయోగించినప్పుడు అప్పుడు తప్పని చంద్రబాబుకు తెలియలేదా అంటూ నిలదీశారు. చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసిందంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబును ఎవరూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలే చంద్రబాబును టార్గెట్ చేసి ఇంటికి పంపించారని రోజా సెటైర్లు వేశారు. మరోవైపు మాజీ మంత్రి నారా లోకేష్ పైనా సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రోజా. లోకేష్ ను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. లోకేష్ చేస్తున్న విమర్శలు కనీసం ఆయనకు అయినా అర్థమవుతున్నాయా అంటూ రోజా విమర్శించారు.