అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తానని శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.

శుక్రవారం నాడు  అసెంబ్లీలో  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఈ విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విషయంలో స్పీకర్  తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభా నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకొందామని ప్రకటించారు. దీంతో రాంబాబు మెత్తబడ్డారు.