చంద్రబాబు హయాంలో ప్రైవేట్ కంపెనీలు రాలేదా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయన్నారు అంబటి
చంద్రబాబు హయాంలో ప్రైవేట్ కంపెనీలు రాలేదా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయన్నారు అంబటి.
గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమైనప్పుడు బాబు అడ్డు చెప్పలేదని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రానికి సీఎం జగన్ స్పష్టమైన లేఖ రాశారని రాంబాబు స్పష్టం చేశారు.
లేఖతో ఏమవుతుందని పవన్ అంటున్నారని.. జగన్ కాజేస్టున్నారని బాబు గగ్గోలు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసిందల్లా కేవలం సుజనా స్టీల్ కోసమేనని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రంతో సంబంధాలున్న పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే ప్రయత్నం చేయాలని రాంబాబు హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన తరుణమిదని ఆయన చెప్పారు.
Also Read:స్టీల్ ప్లాంట్ రగడ: ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో వాస్తవాలు.. అంతా కొరియా సంస్థ కోసమేనా..?
సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిసినా, స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చ జరగలేదని రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు కుమారుడికి నిజాలు చెప్పడం నేర్పాలని కానీ అబద్ధాలు చెప్పడమే నేర్పుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాంబాబు తేల్చి చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చి పెట్టినా కూడా విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
