Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ రగడ: ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో వాస్తవాలు.. అంతా కొరియా సంస్థ కోసమేనా..?

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకు సౌత్ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి చూపించినట్లు కేంద్రం తెలిపింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు.

dharmendra pradhan answer to vijayasai reddy question in parliament about vizag steel ksp
Author
New Delhi, First Published Feb 10, 2021, 6:52 PM IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకు సౌత్ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి చూపించినట్లు కేంద్రం తెలిపింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు పోస్కో ఆర్ఐఎస్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో న్యాయపరంగా కట్టుబాట్లు లేని ఎంవోయూ కుదిరినట్లు చెప్పారు.

ఎంఓయూ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్‌లో 50 శాతం తమకు ఉండాలని పోస్కో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోస్కో- హ్యుండయ్ సంయుక్త బృందం 2018 అక్టోబర్ 22న విశాఖలోని ఆర్ఐఎస్ఎల్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. 

పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైందని ఆయన వెల్లడించారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతం వాటా వుందని ధర్మేంద్ర చెప్పారు.

ఇప్పటి దాకా ఒప్పందం వివరాలు రహస్యమని.. 2019 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పోస్కో బృందం స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2019 జూలై, సెప్టెంబర్‌, 2020లోనూ ఆర్ఐఎస్ఎల్‌ను పరిశీలించిందని ప్రధాన్ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios