చంద్రబాబు జేబులో మనిషి.. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: కన్నాకు అంబటి సవాల్

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా అంతకంతకూ పెరుగుతున్నాయని నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు

ysrcp mla ambati rambabu fires on ap bjp chief kanna lakshminarayana

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా అంతకంతకూ పెరుగుతున్నాయని నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు.

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ 19 కట్టడికి ప్రయత్నిస్తున్నామని రాంబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిక కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.

Also Read:విజయసాయి వ్యాఖ్యల వెనుక కుట్ర, విచారణ చేయాలి: కన్నా డిమాండ్

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కకపోతే వైసీపీలో చేరాలని అనుకోలేదా..? చంద్రబాబుకు రూ.20 కోట్లు అమ్ముడు పోయి ఇప్పుడు మాపై విమర్శలా..? కన్నా లక్ష్మీనారాయణ... చంద్రబాబు జేబులో మనిషని ఎద్దేవా చేశారు.

రూ.20 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌లో సీఎం పదవి కొనుక్కోవాలని ప్రయత్నించలేదా.? బీజేపీ ఎన్నికల ఫండ్‌ను కన్నా కొట్టేశారో లేదో చెప్పాలి. గత ఏడాది ఏప్రిల్ 24న నిజంగానే గుండెపోటు వచ్చిందా..? 2019లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల ఫండ్‌ను సద్వినియోగం చేశావా..? అంటూ రాంబాబు విమర్శలు గుప్పించారు.

వందల కోట్లు సంపాదించుకోవడానికి రాజకీయ రాజకీయ అవినీతి చేయలేదని, చంద్రబాబుకు అమ్ముడుపోలేదని లక్ష్మీనారాయణ ప్రమాణం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెబితే కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

Also Read:రంగులేయడానికి 1400 కోట్లు, మరి తీసేయడానికి? వైసీపీ రంగుల రాజకీయం పై కన్నా ఫైర్

కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకే ర్యాపిడ్ కిట్లు కొనుగోలు చేశామని రాంబాబు స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం కూడా ఈ కిట్లను రూ.790కే కొనుగోలు చేసిందని.. వాటిని కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios