అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణల్లో ఒక్కశాతం నిరూపించినా ఆక్షణం నుంచే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. 

మంగళగిరి నియోజకవర్గంలోని వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందజేసిన ఆర్కే అర్హులైన వారికి పెన్షన్‌లు పంపిణీ చేశారు. పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయనేత చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హుల ఇళ్ల వద్దకే పింఛన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్ట తన నియోజకవర్గ పరిధిలో ఉందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంపై పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.