దాదాపు మూడేళ్ల  సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీ శాసన సభాపక్ష సమావేశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వైసీపీ అధినేత. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి (ap cm), వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసనసభాపక్ష (ysrcp legislative meeting ) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 ఎన్నికలే (2024 ap assembly elections) లక్ష్యంగా ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత వైసీఎల్పీ సమావేశం జరగడం విశేషం. ఎమ్మెల్యేల పని తీరుపై సర్వేలు చేయించి నివేదిక తెప్పించుకున్నారు సీఎం వైఎస్ జగన్. నియోజకవర్గ పెండింగ్ పనుల బిల్లుల బకాయిలను ఏప్రిల్‌లోగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలని జగన్ నేతలను ఆదేశించారు. 

నెలకు 10 సచివాలయాలను సందర్శించాలని.. సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అలాగే జూలైలో ప్లీనరి నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో నిత్యం ప్రజల్లో వుండాలని ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించారు. జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని జగన్ సూచించారు. బూత్ కమిటీలో సగం మంది మహిళలనే చేర్చాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతిరోజు నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని జగన్ చెప్పారు. 

కాగా.. గత Cabinet సమావేశంలోనే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ గురించి సీఎం జగన్ మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. పనితీరు ఆధారంగా మంత్రులను కేబినెట్ లో కొనసాగించనున్నారు. కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ నెల 27వ తేదీన జగన్ మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉగాది రోజున కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ కోసం మంత్రుల రాజీనామా చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్నట్టుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు కూడా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. కేబినెట్ పునర్వవ్వస్థీకరణలో కూడా ఐదు డిప్యూటీ సీఎంలను కొనసాగించనున్నారు. మరో వైపు మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హోం మంత్రిగా సుచరితను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవ్వయస్థీకరిస్తామని జగన్ గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మంత్రుల్లో పని తీరు ఆధారంగా కేబినెట్ లో మార్చులు చేర్పులు కొనసాగించనున్నారు. కొందరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోనున్నారు. 2024 లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సిద్దం చేయడం కోసం జగన్ సర్కార్ టీమ్ ను సిద్దం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగానే మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసే వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా రంగంలోకి దిగనుంది. దీంతో ఈ టీమ్ రంగంలోకి వచ్చే సయమానికి కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు పార్టీలో మార్పులు చేర్పులకు కూడా చేయాలని జగన్ భావిస్తున్నారు. గత వారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇవాళ జరిగే పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా తెలిపారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వస్తే మీరే మంత్రులు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని కొనసాగిస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. న్నికలకు టీమ్ ను తయారు చేసుకొంటున్న జగన్ శాసనసభపక్ష సమావేశంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేసే అవకాశం లేకపోలేదు.