నన్ను చూస్తే భయం, వారంటే లోకువ: బిజెపిపై బాబు నిప్పులు

Ysrcp leaders playing games says   Chandrababunaidu
Highlights

బిజెపిపై బాబు తీవ్ర విమర్శలు

విజయనగరం: కేంద్రప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపి
పెద్దలకు టిడిపిని చూస్తే భయమని, కేసులున్న వైసీపీని
చూస్తే లోకువని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా
చేశారు.విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం
జమ్మాదేవిపేటలోని గ్రామ దర్శిని  కార్యక్రమంలో
చంద్రబాబునాయడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు
కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 

రాష్ట్రంలో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన
చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి నష్టం
వచ్చిన ఫర్వాలేదనే రీతిలో వైసీపీ నేతలు
వ్యవహరిస్తున్నారని చంద్రబాబునాయుడు
విమర్శించారు.మోడీపై విశ్వాసం చూపుతూనే అవిశ్వాసం
పెడుతామని డ్రామాలు ఆడారని బాబు  దుయ్యబట్టారు.

కష్టపడి సంపాదించుకొన్నది శాశ్వతంగా ఉంటుందని
చంద్రబాబునాయుడు చెప్పారు. అవినీతితో
సంపాదించుకొన్నది కొంతకాలం పాటు మాత్రమే
ఉంటుందని బాబు చెప్పారు. ధర్మంగానే డబ్బును
సంపాదించాలని బాబు సూచించారు.


రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి 29 దఫాలు
వెళ్ళినా ప్రయోజనం దక్కలేదన్నారు. ఏపీకి న్యాయం
చేస్తోందని భావిస్తే బిజెపి కూడ అన్యాయమే చేసిందన్నారు.
ఈ కారణంగానే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఆయన
చెప్పారు. 


ఐదు కోట్ల మందిలో చైతన్యం తెచ్చేందుకు నవ నిర్మాణ
దీక్షను చేపడుతున్నట్టు చెప్పారు.  కేంద్రం మోసం
చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని
కేంద్రం అమలు చేయలేదన్నారు. పోరాటం ద్వారానే
ప్రత్యేక హోదా దక్కనుందన్నారు.  అందుకే కేంద్రంపై
ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.


 

loader