గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరో మోసానికి తెరలేపారని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

బుధవారం మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. అసాధ్యమైనదాన్ని సాధ్యమని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. 

రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాపుల ఆశలు అలాగే ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు టక్కుటమార విద్యలో భాగమే కాపు రిజర్వేషన్లు: వైసీపీ నేత కన్నబాబు