పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే దెబ్బ తగలడం వల్ల, తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న కుప్పం కోట బద్ధలు కావడంతో వచ్చిన నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 

పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే దెబ్బ తగలడం వల్ల, తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న కుప్పం కోట బద్ధలు కావడంతో వచ్చిన నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

గత మూడు రోజులుగా ఆయన ఫస్ట్రేషన్ పరాకాష్టకు చేరిందని ఆయన ధ్వజమెత్తారు. నిన్న బెజవాడలో బాగా పెరిగిపోయిందని సజ్జల సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై పశ్చాత్తాపడకపోగా... గుంటూరులో సైతం అలాగే మాట్లాడారంటూ ఫైరయ్యారు.

చంద్రబాబుకు అధికారం వారసత్వంగా రాలేదని.. కుట్రపన్ని వెన్నుపోటు ద్వారా దక్కించుకున్నారంటూ సజ్జల ఆరోపించారు. కూటములను ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఉక్రోషం, ఆక్రోశం ఎందుకో, ఎవరిమీదో అర్థం కావడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ప్రజలు శాశ్వతంగా తన బానిసలుగా వుంటామని 100 రూపాయల ప్రామీసరి నోటీ మీద రాసిచ్చినట్లుగా చంద్రబాబు ధోరణి వుందని సజ్జల వ్యాఖ్యానించారు.

తాను చిటికేస్తే జగన్‌ను ఓడించాలి, లేదంటే నన్ను ఎన్నుకోవాలి మీకు వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా టీడీపీ అధినేత ప్రజలను బెదిరిస్తున్నారని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ తరహా నాయకుడు ఉండడని ఆయన సెటైర్లు వేశారు.

వార్డులు, మున్సిపాలిటీల్లో వైసీపీకి ఓట్లు వేసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సజ్జల పిలుపునిచ్చారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు తాము ఏం చేయగలమో చెప్పి ఓట్లు అభ్యర్ధిస్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు.