వివేకా కేసు .. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ, ఏ స్టేట్‌మెంట్ చూసినా చంద్రబాబుకు అనుకూలంగానే : సీబీఐపై సజ్జల ఆరోపణ
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు అత్యంత దారుణమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను, వైఎస్ భారతితో మాట్లాడిన ఫోన్ ఆధారంగాత నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారని ఆయన మండిపడ్డారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందన్నారు. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. దర్యాప్తు సంస్థల చరిత్రలో వివేకా హత్య కేసు విచారణ మచ్చుతునక అని సజ్జల వ్యాఖ్యానించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు అత్యంత దారుణమని రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారని.. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని రామకృష్ణారెడ్డి అన్నారు. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్‌మెంట్ వస్తుందని సజ్జల తెలిపారు. వివేకా కేసులో గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్ధమైందని రామకృష్ణారెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారని.. తాను, వైఎస్ భారతితో మాట్లాడిన ఫోన్ ఆధారంగాత నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారని ఆయన మండిపడ్డారు.
సునీత ఇప్పటి వరకు ఆరు, ఏడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని.. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషయం చిమ్ముతున్నారని సజ్జల ఆరోపించారు. షమీమ్‌తో రెండో వివాహం గురించి కొత్త ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించి అది కారణం కాదని తేల్చారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. పొలిటికల్‌గా సూసైడ్ చేసుకోవాలని అవినాష్ రెడ్డి ఎందుకు అనుకుంటారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు వెంట వుండేవాళ్లు ఈరోజు వివేకా గౌరవాన్ని కాపాడేవాళ్లంటూ ఆయన దుయ్యబట్టారు. ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథనాలు వున్నాయని సజ్జల ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి గౌరవం కాపాడాలని తాము తపన పడుతున్నామని.. వాళ్లు బతికున్నవారిని బజారుకు ఈడుస్తున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సునీత చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆయన తెలిపారు.