హద్దు మీరితే.. ఇకపైనా రియాక్షన్ ఇలాగే వుంటుంది: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్
టీడీపీ (tdp) నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ (ysrcp) నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల (sajjala rama krishna Reddy) రామకృష్ణారెడ్డి. ఇక ముందు కూడా దుర్భాషలాడితే.. రియాక్షన్లు వుంటాయని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన తెలిపారు.
టీడీపీ (tdp) నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ (ysrcp) నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల (sajjala rama krishna Reddy) రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ... వాళ్లు ఎంత రెచ్చగొడుతున్నా తాము సంయమనం పాటిస్తూనే వున్నామన్నారు. ఈ పెద్దాయనకు ఎందుకంత కోపం అంటూ పట్టాభిపై (kommareddy pattabhi) సజ్జల మండిపడ్డారు. పట్టాభి కావాలనే ముఖ్యమంత్రి జగన్‌పై (cm ys jagan) ఆ వ్యాఖ్యలు చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ మాట మాట్లాడినప్పుడే రియాక్షన్ వస్తుందని ఆయనకు తెలుసునంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
పదే పదే ఆ పదాన్ని అనడం వెనుక ఉద్దేశ్యం ఏంటని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి వ్యాఖ్యలు చేశారని సజ్జల ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రియాక్ట్ అవుతారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆర్టికల్ 356 పెట్టమని ఎలా అడుగుతారని సజ్జల ప్రశ్నించారు. ఇష్టానుసారం ముఖ్యమంత్రిపై మాట్లాడితే రియాక్షన్ రాదా అని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు దగ్గరుండే చేయించారని.. టీడీపీ నేతలందరికీ అదే పదాన్ని ఉపయోగిస్తే ఊరుకుంటారా అని సజ్జల ప్రశ్నించారు.
ALso Read:పట్టాభి ఒక ఊరపంది.. చంద్రబాబు అంతు చూడటానికి నేనొక్కడిని చాలు: కొడాలి నాని
మహారాష్ట్ర సీఎంను చెంప పగలగొట్టాలని కేంద్ర మంత్రి అంటే అరెస్ట్ చేయలేదా అని ఆయన గుర్తుచేశారు. పట్టాభి వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటున్నారని సజ్జల దుయ్యబట్టారు. టీడీపీ పూర్తిగా హద్దు దాటిందని... పట్టాభి మాట్లాడిన తీరు ఆవేశంలో మాట్లాడినట్లు లేదన్నారు. వ్యూహం ప్రకారం కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేశారని... పదే పదే కావాలనే ఆ తప్పుడు మాటలను ఉపయోగించారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తమ సంయమనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. అటువంటి వ్యాఖ్యలను ఎవరు చేసినా కూడా తప్పేనని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మొదటి నుంచి ప్రజా రాజకీయాలు తెలియవని.. సీఎంకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ఈ స్థాయికి దిగజారారని సజ్జల దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య స్పూర్తి అంటే బండ బూతులు తిట్టడమా అని ఆయన ప్రశ్నించారు. ఇక ముందు కూడా దుర్భాషలాడితే.. రియాక్షన్లు వుంటాయని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన తెలిపారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని చంద్రబాబుకూ తెలుసునని.. కోట్ల మంది అభిమానించే నేతపై దారుణమైన పదజాలం వాడారని సజ్జల దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ అప్పట్లోనే కాంగ్రెస్ నేతలను నానా మాటలు అన్నారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో సైతం ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్న నేతలు ఎక్కడా దుర్భాషలాడిన ఘటనలు లేవని ఆయన చెప్పారు.