పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అనుకూల మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు వెలువడ్డాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అనుకూల మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు వెలువడ్డాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష టీడీపీ వెంటిలేటర్‌పై వుందని.. తొలి దశ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు భారీగా గెలిచారని సజ్జల స్పష్టం చేశారు.

ఎన్నికల్లో తెలుగుదేశం ఎక్కడా కనిపించలేదన్నారు. టీడీపీ వాళ్లది ఏం ఆనందమో తెలియడం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని ఆయన నిలదీశారు.