అధికారంలో వుండగా.. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామా ఎందుకు చేయలేదని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ప్రణాళిక ప్రకారం పోలవరం ఆర్ అండ్ ఆర్ గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని రామకృష్ణారెడ్డి అన్నారు
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విమర్శలు గుప్పించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడని.. ఆయనను ప్రజలు చెత్త బుట్టలో పడేశారని దుయ్యబట్టారు. అధికారంలో వుండగా.. పోలవరం ప్రాజెక్ట్ (polavaram) , ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు రాజీనామా ఎందుకు చేయలేదని సజ్జల నిలదీశారు. ప్రణాళిక ప్రకారం పోలవరం ఆర్ అండ్ ఆర్ గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైనా 41.5 అడుగుల వరకు ఆర్ అండ్ ఆర్‌ను తాను భరిస్తానని సీఎం చెప్పారని సజ్జల గుర్తుచేశారు. 45.5 అడుగుల వరకు నీటిని నింపాలంటే రెండేళ్ల సమయం పడుతుందని.. అప్పటి లోగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 2026 (delimitation of assembly constituencies) వరకు కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం sajjala rama krishna reddy స్పందించారు. అసెంబ్లీ సీట్లు పెంచి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల్లో చాలా హామీలు అమలు కాలేదని సజ్జల అన్నారు. రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగిందని... హామీలు అమలు కాకపోవడం మరింత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం పాలనకు సంబంధించినదని సజ్జల చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం అంశాలు కీలకమని... మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలమని రామకృష్ణారెడ్డి అన్నారు.
Also REad:పరిహారం చెల్లించాకే పోలవరం పూర్తి స్థాయిలో నింపుతాం: కోయగూడలో వైఎస్ జగన్
అంతకుముందు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు పర్యటించారు. చింతూరు మండలం Koyaguda లో సీఎం జగన్ Flood ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే బాధితులకు పరిహారం చెల్లించేందుకు గాను రూ. 22 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. ఈ విషయమై కేంద్రంతో ప్రతి రోజూ కుస్తీ పడుతున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా రూ. 2,900 కోట్లు ఎదురు ఇచ్చినట్టుగా జగన్ గుర్తు చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి రోజూ మాట్లాడుతున్నామన్నారు. ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ కింద నిధులను ప్రభుత్వం స్వంతంగా ఇచ్చే విషయమై ఆలోచిస్తామన్నారు. ముంపు బాధితులు చేసిన త్యాగం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కూడా పోలవరం బాధితులకు పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. . అంతేకాదు పోలవరం బాధితులను పక్కా ఇళ్లలోకి షిఫ్ట్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
