పరిహారం చెల్లించాకే పోలవరం పూర్తి స్థాయిలో నింపుతాం: కోయగూడలో వైఎస్ జగన్


ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం నింపుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 

Polavaram compensation will be given by September: AP CM YS Jagan

చింతూరు:ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే Polavaram  Project ను  పూర్తి స్థాయి నీటి మట్టం నింపుతామని ఏపీ సీఎం YS Jagan స్పష్టం చేశారు. ఒకవేళ  ముంపు బాధితులకు పరిహారం చెల్లించడం ఆలస్యమైతే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం నింపబోమని ఆయన తేల్చి చెప్పారు. 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు పర్యటించారు. చింతూరు మండలం Koyaguda లో సీఎం జగన్ Flood ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. 

పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే బాధితులకు పరిహారం చెల్లించేందుకు గాను రూ. 22 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. ఈ విషయమై కేంద్రంతో ప్రతి రోజూ కుస్తీ పడుతున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా రూ. 2,900 కోట్లు ఎదురు ఇచ్చినట్టుగా జగన్ గుర్తు చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి రోజూ మాట్లాడుతున్నామన్నారు. ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ కింద నిధులను ప్రభుత్వం స్వంతంగా ఇచ్చే విషయమై ఆలోచిస్తామన్నారు.  ముంపు బాధితులు చేసిన త్యాగం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కూడా పోలవరం బాధితులకు పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. . అంతేకాదు పోలవరం బాధితులను పక్కా ఇళ్లలోకి షిఫ్ట్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గోదావరి నదికి గతంలో ఇలాంటి వరదలను  ఎన్నడూ కూడా చూడలేదని ఆయన గుర్తు చేశారు.  Godavari పరివాహక ప్రాంతంలోని నాలుగు మండలాల్లో కలెక్టర్ 20 రోజులుగా  ఉన్నారన్నారు. ఈ నాలుగు మండలాల ప్రజలకు ఇంటింటికి రేషన్ తో పాటు రూ., 2 వేలు అందించామని సీఎం చెప్పారు.పారదర్శకంగా ప్రజలకు వరద సహాయం అందించామన్నారు.  సాధారణంగా నాయకులు వచ్చి సరిగా వరద బాధితులను ఆదుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేస్తుంటారన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం అధికారులకు అవసరమైన నిధులతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించామన్నారు. అంతేకాదు వారికి దిశా నిర్దేశం కూడా చేసినట్టుగా జగన్ వివరించారు

 తాను వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రజల నుండి విమర్శలు రాకుండా పని చేసిన ప్రతి ఒక్క అధికారిని సీఎం జగన్ అభినందించారు.  వరద కారణంగా ఇళ్లు, పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తారన్నారు. అధికారులు వరద  బాధితుల నండి వవరాలు సేకరించి నివేదికను అంధిస్తారని సీఎం  చెప్పారు.  

వరద  బాధితులకు సహాయం అందిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన నష్టంపై 14 రోజుల్లో నివేదికను గ్రామ సచివాలయంలో జాబితాను పెట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం జగన్ చెప్పారు. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే ధరఖాస్తు చేసుకోవాలని సీఎం బాధితులను కోరారు. రెండు  నెలల్లో వరద బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పూరిపాకలకు సంబంధించి పరిహారాన్ని రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు కూడా పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios