పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). సమ్మె ప్రతిపాదన వాయిదా వేయాలని కోరామని .. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు వారి 3 డిమాండ్లను తమ ముందు ఉంచారని సజ్జల తెలిపారు. 

పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సానుకూల పరిణామమని, చర్చల పరంగా మరింత ముందుకెళతామని సజ్జల అన్నారు. సమ్మె ప్రతిపాదన వాయిదా వేయాలని కోరామని .. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు వారి 3 డిమాండ్లను తమ ముందు ఉంచారని సజ్జల తెలిపారు. ఉద్యోగులు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక అడిగారని ఆయన చెప్పారు. జీవోలు రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని, ఉద్యమ కార్యాచరణను నిలిపివేయాలని తాము నచ్చచెప్పే ప్రయత్నం చేశామన్నారు. చర్చల ద్వారా సరిదిద్దుకునేవి ఉంటే పరిష్కరించుకుందామని .. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలంటూ పీఆర్సీ సాధన సమితికి నిన్న ప్రభుత్వం ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.

కాగా.. ప్రభుత్వ సంప్రదింపుల కమిటీతో PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు (ఏపీ Employees సంఘాల నేతలు) మంగళవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ మంత్రుల కమిటీ సోమవారం నాడు రాత్రి లేఖలు పంపింది. పీఆర్సీ సాధన సమితిలో కీలకంగా ఉన్న నేతలందరికీ కూడా AP Govenrment ఈ lettersలను అందించింది. 

రాష్ట్ర ప్రభుత్వం నుండి లిఖితపూర్వక హామీ వస్తేనే చర్చలకు హాజరరౌతామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం నిన్న లిఖితపూర్వకంగా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానం పంపింది.అయితే గతంలో తాము ప్రభుత్వం ముందుంచిన పీఆర్సీ జీవోలను అభయన్స్ లో పెట్టాలని, పాత జీతాలను ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని కూడా పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.ఈ డిమాండ్లకు తలొగ్గి రాత పూర్వకంగా చర్చలకు ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్తామని సోమవారం నాడు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.

అయితే ఇవాళ మంత్రుల కమిటీ నుండి వచ్చిన ఆహ్వానంపై పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమై చర్చించారు.మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున చర్చలకు వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మంత్రుల కమిటీ ముందుకు వెళ్లి ఇప్పటికే ఇచ్చిన డిమాండ్లను మరోసారి ఉంచాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. Ashutosh Mishra committee కమిటీ నివేదికను బయట పెట్టాలని, పీఆర్సీ జీవోలను నిలిపివేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్ చేయనున్నారు. మరో వైపు January నెలకు పాత జీతాలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేయనున్నారు.