వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యతో రాష్ట్రం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.

 

పత్తికొండ వైసీపీ ఇంచార్జగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనపై పక్కా వ్యూహంతోనే ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు.

 

అయితే ఆయన హత్య వెనక రాజకీయ ప్రత్యర్థులు హస్తం ఉందా లేక ఫ్యాక్షన్ కక్షల నేపథ్యంలో ప్రతీకారంగా చేసిందా అనేది ఇంకా తెలియడం లేదు.

 

గత ఎన్నికల్లో ఆయన కేఈ కృష్ణమూర్తిపై ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం వైసీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ పత్తికొండకు ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయనకు ప్రజాధరణ పెరుగుతున్న

నేపథ్యంలో  ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్లే ఈ హత్య చేయించినట్లు పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

మరికొందరు మాత్రం ఆయనది ఫ్యాక్షన హత్యగా భావిస్తున్నారు. నారాయణరెడ్డి గతంలో కప్పట్రాల హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.

అయితే కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.

 

ఈ నేపథ్యంలో ఫాక్షన్ కక్షలతోనే ఆయన హత్య జరిగిఉంటుందన్నది మరికొందరి వాదన.