Asianet News TeluguAsianet News Telugu

నాపై దారుణంగా ప్రవర్తిస్తారా, పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి: లక్ష్మీపార్వతి

చంద్రబాబువి మొదట్నుంచి అడ్డదారి రాజకీయాలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి పాపాల భైరవుని పాపం పండే రోజులు దగ్గరపడ్డాయన్నారు. దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి రానుందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు.

ysrcp leader lakshmi parvathi slams cm chandrababu
Author
Tirupati, First Published May 10, 2019, 12:20 PM IST

తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. త్వరలోనే చంద్రబాబు అరాచక పాలన అంతమవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ సీహెం కావాలన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయంటూ చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్, తన జీవితంపై తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. 

చివరికి మహిళనని కూడా చూడకుండా తనపై చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబువి మొదట్నుంచి అడ్డదారి రాజకీయాలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి పాపాల భైరవుని పాపం పండే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి రానుందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. ఈ నెల 23న రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రానుందని, తమ పార్టీ గెలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ‍్యమంత్రి కావడం తథ్యమన్నారు లక్ష్మీపార్వతి. 

Follow Us:
Download App:
  • android
  • ios