విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కోడికి తలకాయ ఉందో లేదో తెలియదు కాని లోకేష్ కు బుర్ర మాత్రం లేదని అర్దమవుతుందని విమర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 

లోకేష్ నిజంగా ఇది ట్వీట్ చేస్తే నీవు శబాష్ అనాలి. నీ ట్యూటర్ చెబితే ట్వీట్ చేసావని అర్దమవుతుంది. నీకు బుర్ర ఉంటే ఎమ్మెల్సీగా మంత్రి అయ్యావంటనే నీకు బుర్రలేదని అర్థమవుతందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేసే అర్హత లోకేష్ కి లేదంటూ ధ్వజమెత్తారు. 

తండ్రి పంచన చేరి నీడలో బతుకుతున్న వ్యక్తివి నువ్వా జగన్ ను విమర్శించేది అంటూ అంబటి తిట్టిపోశారు. మే 23న మంగళగిరిలో రిజల్ట్ చూసిన తర్వాత కోడికి తలకాయ ఉందో లేదో తెలిసిపోతుందంటూ అంబటి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

తలకాయ లేకుండా కోడి నెలలు బతికేస్తోంది: జగన్ పై నారా లోకేష్ సెటైర్లు