అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ కు తలకాయ లేదంటూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

మొన్నెప్పుడో పేపర్లో చదివా ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ   బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి! అంటూ ట్వీట్ చేశారు. 

మరోవైపు పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి అంటూ మరో ట్వీట్ చేశారు. మెుత్తానికి వైఎస్ జగన్ పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.