Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 31న రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ప్లాన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చేలా వైసీపీలోని కాపు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు అక్టోబర్ 31న రాజమండ్రిలో సమావేశం కానున్నారు.

ysrcp kapu leaders will meet in rajahmundry on 31st october
Author
First Published Oct 29, 2022, 10:58 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చేలా వైసీపీలోని కాపు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు అక్టోబర్ 31న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వైసీపీలోని కాపుల నాయకులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీ అధిష్టానం సూచనలతోనే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. సాధారంగా ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసే విమర్శలకు వైసీపీలో ఆయన సామాజిక వర్గం (కాపు) నేతలు ఎక్కువ కౌంటర్‌ ఇస్తుంటారు. అయితే ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం.. పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన నాయకుల సమావేశంలో వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  ఇప్పటివరకు పవన్ కల్యాణ్ మంచితనం చూశారని.. ప్యాకేజ్ స్టార్‌ అనే సన్నాసి నా కొడుకులు ఎవరంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీసీ నాయుకులను చెప్పు తీసుకోని కొడతానని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

Also Read: బంతి.. కొట్టు.. సన్నాసి.. నాకు బొడ్డుకోసి పేరు పెట్టారా? : వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలపై పవన్ ఫైర్

సమాజంలోని అన్నికులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని తాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇకపై తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. అధికారం మొత్తం కొన్ని కులాల దగ్గర పెట్టుకుంటే కుదరదని.. అన్ని కులాలకు అధికారం రావాలని అన్నారు. ‘‘బంతి..  కొట్టు.. సన్నాసి.. అనే మూడు కాపులు నాకు బొడ్డుకోసి పేరు పెట్టినట్టుగా మాట్లాడతారు. మేము కాపు నా డ్యాష్‌లమని మాట్లాడతారు. కులం గురించి మాట్లాడితే నాలుక కోస్తా. బంతి చామంతి పూబంతి.. నేను సోదరుడని అంటాడు. అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లకు నేను సోదరుడుని ఏంటి. నా తోని పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి. వెధవ వాగుళ్లు వాగే వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. మీ నాయకుడి అడుగులకు మడుగులు ఒత్తితే నాకు సమస్య లేదు.. కానీ కులాన్ని తగ్గించి మాట్లాడొద్దు. మీరు తగ్గితే తగ్గండి.. కులం మీ వెంట రాదురా.. సన్నాసుల్లారా. తన పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు. మీ నాయకుడి అడుగులకు మడుగులు ఒత్తితే నాకు సమస్య లేదు.. కానీ కులాన్ని తగ్గించి మాట్లాడొద్దు.’’ అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మీరు గులాంగిరీ చేసి.. కులాన్ని ఎందుకు గులాంగిరీ చేయమంటున్నారని ప్రశ్నించారు. 

వైసీపీలో అందరూ నీచులని అనట్లేదని.. కానీ ఆ పార్టీలో నీచుల సమూహం ఎక్కువ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీలోని కాపు నాయకులు స్పందించిన అవి పెద్దగా ప్రభావం చూపలేదని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు సీరియస్‌గా, గట్టి కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నెల 31న రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios