Asianet News TeluguAsianet News Telugu

బంతి.. కొట్టు.. సన్నాసి.. నాకు బొడ్డుకోసి పేరు పెట్టారా? : వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలపై పవన్ ఫైర్

సమాజంలోని అన్నికులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని తాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇకపై తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. 

Pawan kalyan Slams YSRCP Kapu MLAs
Author
First Published Oct 18, 2022, 3:26 PM IST

సమాజంలోని అన్నికులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని తాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇకపై తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ ఈరోజు మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారం మొత్తం కొన్ని కులాల దగ్గర పెట్టుకుంటే కుదరదని.. అన్ని కులాలకు అధికారం రావాలని అన్నారు. వెనకబడిన కులాలకు న్యాయం జరగాలంటే.. అధికారంలో ఉన్న కులాలను అణగదొక్కడం కాదని.. మనం ఎదగడం. అందుకోసం మీకు నా జీవితాన్ని పణంగా పెడతాను’’ అని అన్నారు. 

‘‘బంతి..  కొట్టు.. సన్నాసి.. అనే మూడు కాపులు నాకు బొడ్డుకోసి పేరు పెట్టినట్టుగా మాట్లాడతారు. మేము కాపు నా డ్యాష్‌లమని మాట్లాడతారు. కులం గురించి మాట్లాడితే నాలుక కోస్తా. బంతి చామంతి పూబంతి.. నేను సోదరుడని అంటారు. అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లకు నేను సోదరుడుని ఏంటి. నా తోని పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి. వెధవ వాగుళ్లు వాగే వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. మీ నాయకుడి అడుగులకు మడుగులు ఒత్తితే నాకు సమస్య లేదు.. కానీ కులాన్ని తగ్గించి మాట్లాడొద్దు. మీరు తగ్గితే తగ్గండి.. కులం మీ వెంట రాదురా.. సన్నాసుల్లారా. తన పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు. మీ నాయకుడి అడుగులకు మడుగులు ఒత్తితే నాకు సమస్య లేదు.. కానీ కులాన్ని తగ్గించి మాట్లాడొద్దు.’’ అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మీరు గులాంగిరీ చేసి.. కులాన్ని ఎందుకు గులాంగిరీ చేయమంటున్నారని ప్రశ్నించారు. 

Also Read: మోదీ అంటే గౌరవం.. అలా అని నా స్థాయిని నేను చంపుకోను: బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు..

వైసీపీలో అందరూ నీచులని అనట్లేదని.. కానీ ఆ పార్టీలో నీచుల సమూహం ఎక్కువ అని అన్నారు. కడుపు కాలితే చేసే పోరాటమే యుద్దం అని అన్నారు. తన గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చిందే ఈ పోరాట పటిమ వచ్చిందని చెప్పారు. కానీ ఏపీలో ఆంధ్ర అనే భావన ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. అది మన దౌర్భగ్యం అని అన్నారు. 

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని నేను ఊరికే చెప్పలేదు. పల్నాటి బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పారు. మాల  కులానికి చెందిన కన్నమనాయుడిని ప్రధాన సేనాని చేశారు. అన్ని కులాలు సమానమని చెప్పేందుకు చాపకూడు సిద్దాంతం తెచ్చారు. 

Also Read: తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా.. నేను యుద్దానికి రెడీ: వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎందరో  ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఉక్కు పరిశ్రమ గురించి వైసీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం ఆ త్యాగధనుల చరిత్ర వైసీపీ నాయకులకు తెలుసా అంటూ సెటైర్లు వేశారు. ఉత్తరాంధ్ర కోసం వైసీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ కోసం గనులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. తాను ఉత్తరాంధ్రలో తిరిగాను.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిలబడితే.. ప్రైవేటీకరణ కాకుండా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. దెబ్బలు తింటా, జైలుకు వెళతానని చెప్పారు. కానీ ఇంట్లో కూర్చొని తమను పోరాటం చేయంటే కుదరదని అన్నారు. 

‘‘భారతమ్మ‌ను తిట్టారని తెగ బాధపడుతున్నారు. నా కన్నతల్లి అంజనాదేవిని ఎంత నీచంగా తిట్టించారు. తప్పటడగులు వేసే నా బిడ్డలను కూడా తిట్టించారు. మీకు కాలితేనేనా నొప్పి.. మీరు మాటలు అంటే మాకు నొప్పి రాదా?’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios