కాంగ్రెస్ కు షాక్ వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి

ysrcp joing ex ministar killi krupaaran
Highlights

వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. అయితే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నప్పుడు ఆ సమయంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారట. పాదయాత్ర శ్రీకాకుళం చేరేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నందున కిల్లి కృపారాణిని ముందే పార్టీలో చేరేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందట. అలా వీలుకాని పక్షంలో ముందుగా ఆమెతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన ఇప్పించాలని ప్రయత్నం చేస్తోందట.

 

loader