టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు పోటీగా కౌంటర్ దీక్షలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తామని వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) తెలిపారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజులు దీక్షలు చేస్తామన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు పోటీగా కౌంటర్ దీక్షలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తామని వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) తెలిపారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజులు దీక్షలు చేస్తామన్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు ( janaagraha deeksha) చేస్తున్నామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
కాగా.. తెలుగుదేశం పార్టీ ( telugu desam party ) కార్యాలయాలపై మంగళవారం వైసీపీ (ysrcp) శ్రేణులు దాడి చేసిన ఘటనలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ చర్యలను నిరసిస్తూ.. బుధవారం ఏపీ బంద్‌కు (ap bandh) టీడీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేయనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Also Read:టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు: 36 గంటల పాటు దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్
మరోవైపు, నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. శనివారంనాడు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేసిన దాడిపై ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నారు.
ఇదిలావుంటే మంగళవారం mangalagiri లోని tdp head office తో పాటు వివిధ చోట్ల టిడిపి ఆఫీసులపై దాడులు చేసిన 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. దాడుల సమయంలో తీసిన వీడియోలు, సిసి కెమెరాలో రికార్డయిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల నుండి సేకరించిన వివరాల ఆధారంగా కొందరిని గుర్తించినట్లు... వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టిడిపి కార్యాలయాలపై దాడులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
