Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు: 36 గంటల పాటు దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేయనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

tdp chief chandra babu naidu hunger strike on thursday and friday
Author
Amaravati, First Published Oct 20, 2021, 2:24 PM IST

తెలుగుదేశం పార్టీ ( telugu desam party ) కార్యాలయాలపై వైసీపీ (ysrcp) శ్రేణులు దాడి చేసిన ఘటనలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ చర్యలను నిరసిస్తూ.. బుధవారం ఏపీ బంద్‌కు (ap bandh) టీడీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేయనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

కాగా, నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. శనివారంనాడు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేసిన దాడిపై ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నారు.

ఇదిలావుంటే మంగళవారం mangalagiri లోని tdp head office తో పాటు వివిధ చోట్ల టిడిపి ఆఫీసులపై దాడులు చేసిన 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. దాడుల సమయంలో తీసిన వీడియోలు, సిసి కెమెరాలో రికార్డయిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల నుండి సేకరించిన వివరాల ఆధారంగా కొందరిని గుర్తించినట్లు... వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టిడిపి కార్యాలయాలపై దాడులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

ALso Read:AP Bandh: పోలీస్ అధికారిపై దాడి... నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై (nara lokesh) బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. స్థానిక సీఐ నాయక్‌పై లోకేష్ దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులో లోకేష్ ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఎ2 అశోక్ బాబు (ashok babu), ఎ3 అలపాటి రాజా (alapati raja), ఎ4 తెనాలి శ్రవణ్ కుమార్ (shravan kumar). ఎ5 పోతినేని శ్రీనివాసరావు (pothineni srinivas) గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. 

మంగళవారం దాడి జరిగిన TDP జాతీయ కార్యాలయానికి స్థానిక సీఐ నాయక్ వెళ్ళగా అక్కడే వున్న nara lokesh ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సహా అక్కడున్నవారు సీఐపై దాడికి తెగబడ్డారని... వారి నుండి తప్పించుకున్న సీఐ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐపై దాడికి ప్రేరేపించింది లోకేష్ కాబట్టి ఆయనను ఎ1గా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. 

కాగా, తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బుధవారం బంద్ నిర్వహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లను, నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ పసుపు శ్రేణులు నిరసన తెలుపుతూనే వున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios