విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిచ్చి పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ దానికి వైసీపీ రంగులు పూయడం అలవాటుగా మారిపోయింది. 

ప్రభుత్వ పాఠశాలలు దగ్గర నుంచి చివరికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మగాంధీని సైతం వదల్లేదు. ప్రభుత్వ పాఠశాలలు, స్మశాన వాటికలు,మహాత్మగాంధీ విగ్రహాలకు సైతం వైసీపీ రంగులు వేస్తున్నారు. 

రంగులు వేయడానికి కాదేది అనర్హం అనుకున్నారో ఏమో ఏకంగా దేవుడిని సైతం వదల్లేదు. అది కూడా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో కావడం మరోవిశేషం. 

గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు... తప్పుడు ప్రచారమని నిరూపించిన అధికార పార్టీ

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండంలం రుంకానవీధిలో శ్రీ దత్త సాయిమందిరంలో సాయిబాబాకి వైసీపీ రంగు చీర కప్పడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ఒక్కసారిగా భక్తులు అవాక్కయ్యారు. దేవుడిని సైతం వదల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. ఇప్పటి వరకు పశువులు, ప్రభుత్వ పాఠశాలలు, స్మశాన వాటికలు, మహాత్మగాంధీ విగ్రహాలకు మాత్రమే రంగులు వేసిన వైసీపీ చివరికి దేవుడిని కూడా వదల్లేదంటూ మండిపడుతున్నారు. 

చివరికి గేదెలను వాడేస్తున్నారు: కొమ్ములకు వైసీపీ రంగు, ఫోటోలు వైరల్

 షిర్డీ సాయిబాబాకు వైసీపీ రంగుల చీర కప్పడం నిజామా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే గాంధీ విగ్రహాలకు వైసీపీ రంగులు వేసిందన్న ఆరోపణలను వైసీపీ ఖండించింది. తాము వేయలేదంటూ అందుకు ఆధారాలను సైతం బయటపెట్టింది. 

అయితే ఇది దేవుడితో ముడిపడిన అంశం కావడం, సెన్సిటీవ్ ఇష్యూ కావడంతో దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఎవరైనా కావాలని క్రియేట్ చేశారా లేక నిజంగానే సమర్పించారా అన్నది తెలియాల్సి ఉంది.