పంచాయతీ ఎన్నిలపై టీడీపీ మేనిఫెస్టో: చంద్రబాబుపై వైసీపీ ఫిర్యాదు

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై శుక్రవారం ఎన్నికల సంఘానికి వైసీసీ ఫిర్యాదు చేసింది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ysrcp complaints against tdp chief chandrababu naidu ksp

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై శుక్రవారం ఎన్నికల సంఘానికి వైసీసీ ఫిర్యాదు చేసింది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మేరకు వైసీసీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి సాయిరాం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించారు.  

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికను తెదేపా అధినేత చంద్రబాబు గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. పంచ సూత్రాలతో టీడీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది.

Also Read:బెదిరించి ఏకగ్రీవాలు: పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బాబు

ఐదే ఐదు అంశాలు.,, రెండే రెండు పేజీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు. పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టో ఉంది.

ఇందులో సురక్షితమైన తాగునీరు, భద్రతతకు ప్రశాంతతకు భరోసా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం, స్వయం సమృద్ధి, ఆస్తిపన్ను తగ్గింప-పౌర సేవల పేరుతో ఐదు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు చంద్రబాబు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios