Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్ధులు వీరే.. మర్రి రాజశేఖర్‌కు మళ్లీ మొండిచేయి

స్థానిక సంస్థల కోటా (local bodies quota ) ఎమ్మెల్సీ ఎన్నికల (ap mlc elections) సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) తన అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు

ysrcp candidates list for local bodies quota mlc election in andhra pradesh
Author
Amaravati, First Published Nov 12, 2021, 5:42 PM IST

స్థానిక సంస్థల కోటా (local bodies quota ) ఎమ్మెల్సీ ఎన్నికల (ap mlc elections) సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) తన అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని (ys jagan mohan reddy) ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించామని సజ్జల వెల్లడించారు. 

వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే:

  1. ఇందుకూరు రాజు (విజయనగరం) 
  2. వరుదు కళ్యాణి (విశాఖ)
  3. వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
  4. అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
  5. మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
  6. తలశిల రఘురామ్ (కృష్ణా)
  7. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
  8. మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
  9. తూమాటి మాధవరావు (ప్రకాశం)
  10. కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
  11. వై శివరామిరెడ్డి (అనంతపురం)

చిలకలూరిపేటకు చెందిన సీనియర్‌ నేత మర్రి రాజశేఖర్‌కు (marri rajashekar) సుధీర్ఘ నిరీక్షణ తర్వాత పదవి వరించనున్నట్లు ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలవాల్సినప్పటికీ.. చివరి నిమిషంలో అప్పటి టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై (prattipati pullarao) బీసీ మహిళగా విడిదల రజనీని బరిలోకి దింపింది. దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోటీ నుంచి తప్పుకున్న మర్రి రాజశేఖర్‌కు అప్పుడే జగన్ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన రెండు స్థానాల్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఇక మరో స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి, మురుగుడు హనుమంతరావుకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది. 

కాగా.. ఏపీలో ఎమ్యెల్యే కోటా (mla quota) ఎమ్మెల్సీల్లో 3, స్థానిక సంస్థల (local body quota) కోటాలో 11 స్థానాలు భర్తీకానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుండగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. స్థానిక సంస్థల్లోనూ, ఎమ్మెల్యేల బలాల రీత్యా గంపగుత్తగా 14 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం వుంది. దీంతో శాసనమండలిలో టీడీపీ బలం తగ్గి.. వైసీపీ ఆధిక్యం కనబరచనుంది. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 10 ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం జిల్లా), ఇషాక్ బాషా (కర్నూలు జిల్లా), డీసీ గోవింద రెడ్డి (కడప జిల్లా)లను అభ్యర్ధులుగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios