అమరావతి: చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్. కరణం బలరాం అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చరాని ఆరోపించారు. 

కరణం బలరాంకు నలుగురు సంతామని తెలిపారు ఆమంచి కృష్ణమోహన్. అయితే ఎన్నికల అఫిడవిట్ లో కేవలం ముగ్గురు అని మాత్రమే చూపించారని ఆరోపించారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం హైకోర్టుకు సమర్పించారు. 

కరణం బలరాంపై అనర్హత వేటు వేయాలని తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు ఆమంచి కృష్ణమోహన్. ఇకపోతే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరాం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. 

ఈ ఎన్నికల్లో కరణం బలరాం గెలుపొందారు. అయితే కరణం బలరాం ఎన్నిక చెల్లదని తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదుపై కరణం బలరాం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.