తిరుపతి లోక్‌సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తారని  ఆపార్టీ శుక్రవారం నాడు ప్రకటించింది.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ప్రకటించింది.

జగన్ పాదయాత్ర చేసే సమయంలో జగన్ తో పాటు డాక్టర్ గురుమూర్తి ఆయన వెంటే ఉన్నారు. తిరుపతి ఎంపీగా ఉంటూ అనారోగ్యంతో మరణించిన బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చే అవకాశం ఉంది.

also read:తిరుపతి ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గురుమూర్తి పేరు ఖరారు?

ఈ స్థానాన్ని తిరిగి నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ స్థానంలో మరోసారి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేసింది.బీజేపీతో పాటు జనసేన కూడ ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నాయి.గత ఎన్నికల్లో తిరుపతి స్థానంలో బీఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతును ప్రకటించింది. ఈ దఫా బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంది. 

 

2019 ఎన్నికల ముందే బల్లి దుర్గాప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలో చేరి తిరుపతి నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన ఆనారోగ్యంతో మరణిించడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.