తిరుపతి ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గురుమూర్తి పేరు ఖరారు?

First Published 20, Nov 2020, 12:29 PM

తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో చేరాడు. వెంటనే ఆయన తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవల ఆయన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సీఎం జగన్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.

అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని జగన్ కు కట్టబెట్టారు నేతలు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు పలువురి పేర్లతో పాటు జగన్ వెంట పాదయాత్రలో నడిచిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ పరిశీలిస్తోంది.

అందరి కంటే డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధుల రేసులో అగ్రభాగాన నిలిచారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కూడ వైసీపీ నాయకత్వం భావిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి ఈ విషయమై చర్చించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం యోచనలో ఉందని సమాచారం.వైసీపీ నాయకత్వం డాక్టర్ గురుమూర్తి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇదే స్థానం నుండి టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దింపనుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి పనబాక లక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో ఆమెను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపారు. కానీ ఆమె వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఈ స్థానం నుండి బీజేపీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం ఉంది.