జగన్ కు మరొక గుడ్ బై ?

YSRC MLA to defect to Chandrababu Naidu TDP
Highlights

 పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జగన్ కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నదా !

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశంలో చేరేతున్నారనే  వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

ఆదివారం నాడు టిడిపి వర్గాల్లో ఇది  హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేరికకు  ముహూర్తం సిద్ధమైనట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు.

 

కొత్త కొద్ది రోజులుగా  వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి  అధికార పార్టీలోకి వలసలు తగ్గాయి. తొందర్లో నే మరొక 20 మంది చేరతారని,  జగన్కు అపుడు ప్రతిపక్షనాయకుడి హోదా కూడా పోతూ ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆ మధ్య బాహాటంగానే చెబుతూ వచ్చారు. ఈ బెదిరింపు తాటాకు చప్పుడే నని  వైఎస్ ఆర్  కాంగ్రెస్ నేతులు ఖండిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇపుడు మళ్లీ ఉప్పులేటి కల్పన  జగన్ కు గుడ్ బై కొడుతూ ఉందని చెబుతున్నారు.

 

నిజానికి ఆమె పేరు మరొక రెండు పేర్లతో కలసి చాలా రోజులు వలస పక్షుల జాబితా కెక్కింది. మగతా ఇద్దరు నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే నిధి.

 

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఉండటం,  వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలిగా, శాసనసభ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యత నిర్వహిస్తూ ఉండటంతో  కల్పన  పార్టీ వదలిపెట్టరని అనుకున్నారు. ఆమె కూడా అంతే తీవ్ర స్వరంతో ఖండిస్తూ వచ్చారు.

 

ఇపుడు నిన్నటి నుంచి మంచి ఆమె పార్టీ ఫిరాయిస్తారనే  వార్త షికారు చేస్తూ ఉంది. 

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుండి ఆదివారంనాడు కల్పనకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలుగుదేశం నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు.  వైసిపి నాయకులతో వాకబు చేస్తే ఇలాంటి పుకారు వార దృష్టికి వచ్చిందని చెబుతున్నారు.

loader