వైఎస్ విగ్రహాన్ని తగలబెట్టేసారు

వైఎస్ విగ్రహాన్ని తగలబెట్టేసారు

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై పడినట్లే ఉంది. వైఎస్సార్ లేరు కదా ఇక ప్రభావం ఏముందనుకుంటున్నారా? అదేలేండి వైఎస్సార్ విగ్రహంపైన. ఇంతకీ విషయం ఏమిటంటే, గుంటూరు జిల్లాలో కొందరు గుర్తు తెలీని వ్యక్తులు వైఎస్సార్ విగ్రహాని తగలపెట్టేశారు. జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో జరిగింది ఈ ఘటన.

నియోజకవర్గంలోని  దాచేపల్లి మండలం కేసనిపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ఎంతో ప్రేమతో రాజన్న గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దాంతో చందాల రూపంలో డబ్బులు కూడగట్టారు. దానికి వైసిపి నేత కాసు మహేష్ రెడ్డి తనవంతు సాయం చేశారు.  (ఈరోజు) గురువారం తెల్లారితే విగ్రహం ఆవిష్కరణ చేసుకొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇంతలో బుధవారం రాత్రి గుర్తుతెలీని వ్యక్తలు కొందరు విగ్రహానికి నిప్పుపెట్టారు.  

విషయం తెలియగానే స్పందించిన కాసు మహేష్ రెడ్డి, వైసిపి నేతలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సంఘటన స్దలాన్ని పరిశీలించారు. తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు.  జగన్ పాదయాత్ర సక్సెస్ అవ్వటాన్ని జీర్ణించుకోలేని ఎవరో కావాలనే వైఎస్సార్ విగ్రహాన్ని తగలపెట్టేసారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos