బిఎండబ్యూ కారును యువకుడిపైకి ఎక్కించిన వైసిపి ఎంపీ కూతురు ... ఇలా అరెస్ట్, అలా రిలీజ్  

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూతురు హిట్ ఆండ్ రన్ కేసులో చిక్కుకున్నారు. బీద మస్తాన్ రావు కూతురు మాధురి ఓ యాక్సిడెంట్ కేసులో అరెస్టవడం సంచలనంగా మారింది.

YSR Congress Party MP Beeda Mastan Rao Daughter Madhuri Arrested in Accident Case AKP

చెన్నై : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి(33) హిట్ ఆండ్ రన్ కేసులో అరెస్టయ్యారు. ఖరీదైన కారును మితిమీరిన వేగంతో నడిపే క్రమంలో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్ పాత్ పైకెక్కి నిద్రిస్తున్న ఓ యువకుడి పైనుండి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటన గత సోమవారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.  

అసలేం జరిగింది : 

వైసిపి ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి ప్రస్తుతం చెన్నైలో వుంటున్నారు. సోమవారం రాత్రి మాధురి తన స్నేహితురాలితో కలిసి బిఎండబ్యూ కారులో బయటకు వచ్చింది. బీసెంట్ రోడ్డులో వీరు కారును వేగంగా పోనిస్తుండగా అదుపుతప్పి పుట్ ఫాత్ పైకి దూసుకెళ్ళింది. దీంతో పుట్ ఫాత్ పై నిద్రిస్తున్న 24 ఏళ్ల పెయింటర్ సూర్య ప్రాణాలు కోల్పోయాడు.

ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న సూర్య పైనుండి కారు దూసుకెళ్ళడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడు ప్రాణాపాయ స్థితిలో విలవిల్లాడిపోయినా   ప్రమాదానికి కారణమైన మాధురి, ఆమె స్నేహితురాలు ఎలాంటి సాయం చేయలేదు. ప్రమాదాన్ని గమనించిన కొందరు అక్కడ గుమిగూడేసరికే వైసిపి ఎంపీ కూతురు అక్కడి నుండి పరారయ్యారు... ఆమె స్నేహితురాలు మాత్రం అక్కడే వుంది. ఆమె కూడా ప్రమాదంగురించి ప్రశ్నించినవారితో వాగ్వివాదానికి దిగారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యను హాస్పిటల్ కు తరలించినా లాభం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ అతడు హాస్పిటల్ కు చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడు.   సూర్య మృతిపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యుల హాస్పిటల్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

సూర్య మృతికి కారణమైనవారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కుటుంబసభ్యులు, బందువులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వైసిపి ఎంపీ కూతురును అరెస్ట్ చేసారు. 

ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాల ఆధారంగా డ్రైవింగ్ చేసింది మాధురి అని గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసారు... వెంటనే ఆమెకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ ప్రమాదం సోమవారమే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios