విజయవాడ : ఎన్నికల ఫలితాలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆయా పార్టీలతో పాటు ప్రజలు సైతం ఉత్కంఠగా ఫలితాలపై ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులను ప్రారంభించింది. 

వైసీపీ తరపున పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతోపాటు ప్రదాన ఎన్నికల ఏజెంట్లకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ నిర్వహించింది. ఈ శిక్షణా తరగతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితోపాటు మాజీ సీఎస్ అజయ్ కల్లాంతోపాటు ఐఏఎస్ శామ్యూల్ లు ఈ శిక్షణా తరగతులను ప్రారంభించారు. 

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు ఏజెంట్ల విధులపై శిక్షణ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వనున్నారు. 

 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి