కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివేకా డ్రైవర్ ప్రసాద్, వంట మనిషి లక్ష్మిని, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వివేకానంద రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రసాద్ పై నిందలు వేస్తూ వైఎస్ వివేకా రాశాడని చెబుతున్న లేఖ నిజమైందా, కాదా అని తేల్చుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి తెర లేపిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకాను హత్య చేసిన తర్వాత ఆధారాలను మాయం చేయడానికి చేసిన ప్రయత్నాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వివేకా హత్యపై సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగుతోంది.