వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా ప్రధాన అనుచరుడు పరమేశ్వరరెడ్డి చుట్టూ ప్రస్తుతం కేసు తిరుగుతోంది.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరెడ్డిని సిట్ బృందం సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. వివేకా హత్య జరిగిన రోజు నుంచి అతను పులివెందుల నుంచి పరారైనట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది.

అనారోగ్యం పేరుతో కడపలోని సన్‌రైజ్ ఆసుపత్రిలో పరమేశ్వరరెడ్డి మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతిలోని సంకల్ప్ ఆసుపత్రిలో చేరాడు.

గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ  బీటెక్ రవి బాబాయ్‌ని పరమేశ్వరరెడ్డి హత్య చేశాడు. వివేకాతో పరమేశ్వరరెడ్డి అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పరమేశ్వరరెడ్డి వెనుకవున్న అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై సిట్ బృందం కూపీ లాగుతోంది.

మరోవైపు వివేకా హత్య కేసులో తమ పాత్ర ఉంటే పులివెందుల పూల అంగడి సెంటర్‌లో ఉరేసుకుంటామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు