మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సప్లిమెంటరీ చార్జీషీట్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టులో సప్లిమెంటరీ చార్జీషీట్ ను సీబీఐ శుక్రవారం నాడు దాఖలు చేసింది. మరో వైపు ఈ కేసులో నిందితులకు కోర్టు జూలై 14వరకు రిమాండ్ ను పొడిగించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను చంచల్ గూడ జైలు నుండి సీబీఐ అధికారులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. నిందితుల రిమాండ్ ను జూలై 14వరకు పొడిగిస్తున్నట్టుగా జడ్జి ఆదేశించారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14న హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐకి నేటీతో గడువు ముగియనుంది. ఇవాళ్టికే విచారణను ముగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై సప్లిమెంటరీ చార్జీషీట్ లో సీబీఐ వివరించనుంది. మరో వైపు ఈ కేసు విచారణనకు మరింత సమయాన్ని సీబీఐ కోరే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది జూలై 3వ తేదీన ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఇటీవలనే కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఐదు దఫాలు సీబీఐ ఆయనను విచారించింది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించిన అంశాలను సుప్రీంకోర్టుకు సీబీఐ తెలపనుంది. జూలై 3న సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని సీబీఐ తెలపనుంది.
also read:వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు నేటీతో ముగియనున్న గడువు:సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేయనున్న సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను రెండు దఫాలు పొడిగించారు. మరోసారి విచారణ గడువును పొడిగించాలని కోరితే సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశం ఏపీ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సీఎం జగన్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.